: పేపర్ చదివినా..ఛానెళ్లలో వార్తలు చూసినా బీపీ వస్తోంది: నటుడు మోహన్ బాబు
పేపర్లు ఎక్కువ చదవనని, ఛానెళ్లలో వార్తలు ఎక్కువగా చూడనని.. ఎందుకంటే, వాటిల్లో అన్యాయం, అక్రమం, మోసం, దగాలతో నిండిన వార్తలు ఉంటున్నాయని, అవి చూస్తే తనకు బీపీ వస్తుందని, అందుకే, సాధ్యమైనంత వరకు వాటి జోలికి వెళ్లనని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు రూపొందించిన ‘అభిషేకం’ సీరియల్ 2,500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సెలెబ్రేషన్స్ లో మోహన్ బాబు మాట్లాడుతూ, ‘అన్యాయం జరిగితే నేను సహించలేను. పోరాడదామంటే, పక్కనున్న వాళ్లు 'నీకు ఎందుకు లే' అంటుంటారు. అలా అనుకున్నట్లయితే, గాంధీ మహాత్ముడు, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్..అన్నయ్య నందమూరి తారక రామారావుగారు, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు, మన కేసీఆర్ గారు రారు. సమాజం కోసం పోరాడాలి’ అని మోహన్ బాబు అన్నారు.