: గ్వాంటెనామోతో మాకు అప్రదిష్ఠ: ఒబామా


గ్వాంటెనామో జైలు విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ఎన్నాళ్లుగానో వస్తున్న ఆరోపణలు, విమర్శలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పందించారు. ఈ జైలులో అనుమానితులను నిర్భందించడం వల్ల అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్నారు. పరోక్షంగా ఈ జైలును మూసివేస్తామని ఆయన సంకేతమిచ్చారు. మంగళవారం ఒబామా ఈ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఖైదీల నుంచి నిరశనతో కూడిన నిరసన ఎదురైంది. ఏళ్లతరబడి తమను విచారణ లేకుండా ఖైదు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఒబామా.. మనుషులే లేని ప్రాంతంలో 100 మందికిపైగా అనుమానితులను బందీలుగా ఉంచడం సరికాదని ఒప్పుకున్నారు.

వాస్తవానికి ఒబామా 2009 అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే గ్వాంటెనామో జైలును మూసేస్తామని హామీ ఇస్తూనే వస్తున్నారు. ఇంతవరకూ అతీగతీలేదు. మళ్లీ ఒబామా అదే పాట పాడారు. దీనిని స్వాగతించిన మానవ హక్కుల ఉద్యమకారులు అధ్యక్షుడు తన మాటలను ఆచరణలో చూపించాలని డిమాండ్ చేశారు. విదేశీ ఉగ్రవాద నిందితులను నిర్భందించడం కోసం క్యూబాలో గ్వాంటెనామో జైలును అమెరికా 2002లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ 166 మంది బందీలుగా ఉన్నారు. ఇక్కడ ఖైదీలు ఒంటరిగా చిమ్మచీకట్లో మగ్గాల్సిందే.

  • Loading...

More Telugu News