: పవన్ కల్యాణ్ ‘దేశ్ బచావో’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘దేశ్ బచావో’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైంది. ‘యూట్యూబ్’ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్ లో దేశభక్తి, స్ఫూర్తి దాయకమైన పాటలను రూపొందించామని, మొత్తం ఆరు పాటలకు గాను ఈ రోజు నాలుగు పాటలను విడుదల చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పాట చొప్పున ఈ రోజు విడుదల చేస్తామని చెప్పారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ఆల్బమ్ ను రూపొందించామని, ఆసియా ఖండంలోనే చిన్న వయస్కుడైన యువ డీజే పృథ్వీ సాయితో ఈ ఆల్బమ్ ను రూపొందించామని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, ‘తమ్ముడు’ చిత్రంలోని ‘ట్రావెలింగ్ సోల్జర్’ అనే పాటకు రీమిక్స్ గా ఈ పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఆల్బమ్ లోని పాటలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని పవన్ తెలిపారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/bZ8YPTtBoWM" frameborder="0" allowfullscreen></iframe>