: అందరూ ప్రియాంకను పొగుడుతుంటే.. ఆమె భర్త మాత్రం రాహుల్ ను పొగిడారు!


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదిరేలా చక్రం తిప్పిన ప్రియాంకగాంధీపై కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తన బావ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె భర్త రాబర్డ్ వాద్రా ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ ఇద్దరూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారిద్దరూ తెలివైన ఆలోచనలు ఉన్న యూత్ ఐకాన్లు అంటూ  ప్రశంసించారు. అయితే, తన భార్య ప్రియాంకపై మాత్రం వాద్రా ఒక్క ప్రశంస కూడా చేయలేదు. అందరూ ప్రియాంకను మాత్రమే పొగుడుతున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీకి మైలేజ్ పెంచేందుకు వాద్రా ఈ కామెంట్స్ చేశారని కొందరు అనుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News