: ఇదో చిత్రం... గుంతకల్లులో ఏటీఎం నుంచి రూ.3 వేలు డ్రా చేస్తే రూ.6 వేలు వస్తాయి!


రాజస్థాన్, అసోం లోని ఏటీఎంలలో విత్ డ్రా చేసుకోవాల్సిన డబ్బు కంటే ఎక్కువ మొత్తం డబ్బు వచ్చిన సంఘటనలు ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో ఇటువంటి సంఘటనే నిన్న రాత్రి జరిగింది. ఎస్బీఐ ఏటీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఖాతాదారులకు విత్ డ్రా చేసుకోవాల్సిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చింది. రూ.3 వేలు డ్రా చేసిన ఖాతాదారులకు రూ.6 వేలు, అంతకు మించి  డబ్బు రావడంతో వారు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై ఓ ఖాతాదారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న బ్యాంకు అధికారులు ఆ ఏటీఎంను పరిశీలించి దానిని ఆపివేయడం జరిగింది. ఏ ఖాతాదారుడు ఎంత డబ్బు తీసుకున్నారనే విషయం సర్వర్ ద్వారా తెలుస్తుందని, ఎక్కువ మొత్తంలో తీసుకున్న డబ్బును తిరిగి వారి నుంచి తీసుకుంటామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News