: మహేశ్, రాంచరణ్... ఇకపై బిజినెస్ ఫ్రెండ్స్ కూడా!


టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, రాంచరణ్ ల మధ్య బంధం రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవలే వీరిద్దరూ తమ ఫ్యామిలీలతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆదివారం నాడు వీరిద్దరూ కలసి పార్టీ చేసుకున్నారు. హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఆదివారం నాడు మహేష్ బాబు భార్య నమ్రత పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు రాంచరణ్ అతని భార్య ఉపాసన కూడా హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, మెహర్ రమేష్ లాంటి మరికొందరు మాత్రమే ఈ పార్టీకి వచ్చారు. మహేష్, చరణ్ ఇద్దరూ కలసి కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలసి హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. ఇప్పటికే దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగాయట. ఉపాసన, నమ్రతల మధ్య ఉన్న స్నేహమే... మహేష్, చరణ్ ల మధ్య స్నేహం బలపడటానికి కారణమని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News