: కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్: ప్రత్తిపాటి పుల్లారావు


ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు నాయుడి బాటలో పేదరిక నిర్మూలనకు కృషి చేయగల నాయకుడు లోకేష్ అని అన్నారు.  సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఎన్టీఆర్, చంద్రబాబుతో సమానంగా పని చేయగల సమర్థుడైన నాయకుడు లోకేష్ అని అన్నారు. కాగా, లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని తిమ్మాపురంలో నిన్న రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి పుల్లారావు పైవిధంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News