: అమితాబ్, జయా బచ్చన్ వేర్వేరుగా ఉంటున్నారట!
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, ఆయన భార్య జయా బచ్చన్ మధ్య విభేదాలు ఏర్పడటంతో, వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఏబీపీ మజ్హా వార్తా సంస్థ పేర్కొంది. కోడలు ఐశ్వర్యా రాయ్ కు, అత్త జయా బచ్చన్ కు పడటం లేదని అమర్ సింగ్ చెప్పినట్టు సదరు వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, ఈ విషయమై అమర్ సింగ్ మాట్లాడుతూ, ప్రతి విషయంలో గొడవలకు తానే కారణం అన్నట్టుగా మీడియా ప్రవర్తిస్తోందని, అమితాబ్, జయా బచ్చన్ లను తాను కలిసే నాటికే వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని చెప్పారు. జయ, ఐశ్వర్య మధ్య విభేదాలు వచ్చినట్టు వదంతులు వచ్చాయని, అందుకు తాను బాధ్యుడిని కాదని అన్నారు. కాగా, అమర్ సింగ్ వ్యాఖ్యలపై బిగ్ బీ కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందనే విషయం వేచి చూడాలని బాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు.