: నేడు ట్రంప్ తో మాట్లాడనున్న మోదీ!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని మోదీ నేడు మాట్లాడనున్నారు. వైట్ హౌస్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు వీరు హాట్ లైన్ ద్వారా మాట్లాడనున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకునేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ట్రంప్ తో కలసి పని చేస్తామని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు, ట్రంప్ తో సంబంధాలను మెరుగుపరుచుకునే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరగరాదని దౌత్య నిపుణులు సూచిస్తున్నారు.