: జల్లికట్టు నిరసన హింసాత్మకంగా మారిన సందర్భంలోని.. ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కమలహాసన్


తమిళనాడులో జల్లికట్టు కోసం గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా కొనసాగిన ఆందోళనలు నిన్న తీవ్ర రూపం దాల్చి, హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. అంతేకాదు, మెరీనా బీచ్ సమీపంలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో, తీవ్ర అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలో, విలక్షణ నటుడు కమలహాసన్ ఓ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

నిరసన సమయంలో ఓ పోలీసే ఆటోకు నిప్పు పెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏంటి, పోలీసులే ఇలాంటి పని చేశారా? అంటూ అందరూ మండిపడుతున్నారు. అయితే, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియన్ పోలీసు అధికారి శంకర్ స్పష్టం చేశారు. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని, దీనిపై విచారణ జరుపుతామని మరో పోలీసు అధికారి రాజేంద్రన్ తెలిపారు.

  • Loading...

More Telugu News