: రైల్వే టికెట్‌పై ప‌ది పైస‌ల సెస్సు.. కూలీల సామాజిక భ‌ద్ర‌త కోస‌మే!


కూలీల భ‌విష్య నిధి, పింఛ‌ను, గ్రూప్ బీమా వంటి క‌నీస సౌక‌ర్యాల కోసం ప్ర‌తి రైల్వే టికెట్‌పై ప‌ది పైస‌ల సెస్సు విధించాలంటూ కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న అందింది. ఫిబ్ర‌వ‌రి 1న ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్‌లో కేంద్రం ఈ కొత్త సెస్సును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ప్ర‌తి టికెట్‌పై ప‌ది పైస‌ల సెస్సు విధించ‌డం ద్వారా ప్ర‌తి ఏటా రూ.4.38 కోట్లు స‌మ‌కూరుతుంది. ఈ సొమ్ముతో కూలీల భ‌విష్య నిధితోపాటు పింఛ‌ను, గ్రూప్ బీమా వంటి సౌక‌ర్యాల‌ను అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే కార్మిక శాఖ ప్ర‌తిపాదించిన సెస్సును ఒక్కో టికెట్‌పైనే త‌ప్ప ఒక్కో ప్ర‌యాణికుడిపై విధించ‌రు. అంటే ఒక టికెట్‌పై ఎంత‌మంది ప్ర‌యాణించినా సెస్సు మాత్రం ప‌ది పైస‌లే విధిస్తార‌న్న‌మాట‌.

  • Loading...

More Telugu News