: అమెరికా ముస్లింలకు ఇరుగుపొరుగు బాసట.. మేమున్నామంటూ భరోసా
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి భయంతో వణికిపోతున్న అమెరికాలోని ముస్లింలకు ఇరుగుపొరుగు అమెరికన్ల నుంచి ఆపన్నహస్తం అందుతోంది. ట్రంప్ అధ్యక్షుడైనంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని, ఆందోళన అస్సలే వద్దని, మీ వెంట మేమున్నామంటూ ముస్లింలకు లేఖలు రాస్తున్నారు. దేశంలో ఇప్పుడు కొత్త దశ ప్రారంభమైందని, ఏం జరిగినా ఫర్వాలేదని చెబుతున్నారు. ముస్లింలు తమ మతాన్ని నిరభ్యంతరంగా కొనసాగించవచ్చని, వివక్ష లేకుండా జీవించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే తమను సంప్రదించవచ్చని, ఏ సమయంలోనైనా తమ తలుపులు తట్టవచ్చంటూ ముస్లింలలో ఆత్మవిశ్వాసం పెరిగేలా లేఖలు రాస్తున్నారు. సిన్సినాటిలోని అబూబకర్ అమ్రీకి తన పొరుగున ఉన్న అమెరికన్ల నుంచి ఇటువంటి లేఖ ఒకటి అందింది. మరికొందరు ముస్లింలకు కూడా ఇటువంటి లేఖలే అందాయి.