: మూడు నెలల పాటు ఫ్రీ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. జియో నుంచి పోటీని తట్టుకునేందుకేనా?
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే పలు ప్రైవేటు ఆపరేటర్లు టారిఫ్ ఆఫర్లను భారీగా తగ్గించి తమ ఖాతాదారులు పక్క చూపులు చూడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. కేవలం రూ.149 రీచార్జ్‌తో ఏ నెట్‌వర్క్‌కు అయినా నెలరోజులపాటు అన్‌లిమిట్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది. అలాగే రూ.439తో రీచార్జ్ చేసుకుని మూడు నెలలపాటు ఉచితంగా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు అరగంటకు మించి కాల్స్ చేసుకోవడం కుదరదు. తాజా పథకం నేటి (మంగళవారం) నుంచే అందుబాటులోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.