: సుదీర్ఘ పాఠం చెప్పి గిన్నిస్ రికార్డు సృష్టించిన అధ్యాపకుడు!
కరీంనగర్ లోని నారాయణ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ఎల్‌నారాయణ గిన్నిస్ రికార్డు సృష్టించారు. కరీంనగర్‌లోని ట్రినిటీ జూనియర్ కళాశాలలో సోమవారం 4 వేల మంది విద్యార్థులకు గంటన్నరపాటు బిజినెస్ పాఠాలు చెప్పి గత రికార్డులను బద్దలుగొట్టారు. ఇండోనేషియాలోని ఆండేకామెరూన్ అనే వ్యక్తి గతంలో 2464 మందికి బిజినెస్ పాఠాలు చెప్పి గిన్నిస్ రికార్డు సాధించారు. ఇప్పుడు నారాయణ సుదీర్ఘ పాఠంతో ఆ రికార్డును బద్దలుగొట్టారు. గంటన్నరపాటు ఆయన చెప్పిన పాఠాన్ని విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. పాఠం పూర్తయిన అనంతరం విద్యార్థుల సందేహాలను నారాయణ నివృత్తి చేశారు. పాఠం చెప్పడం పూర్తయిన అనంతరం ఆయన గిన్నిస్ రికార్డుకు అర్హత సాధించినట్టు గిన్నిస్ బుక్ ప్రతినిధి తెలిపారు. వారం రోజుల్లో లండన్ నుంచి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని పంపిస్తామని పేర్కొన్నారు.