: విజయ్‌మాల్యా కేసులో ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్ అరెస్ట్
మాజీ లిక్కర్ కింగ్, ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా మనీ లాండరింగ్ కేసులో సోమవారం ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. యోగేష్‌తోపాటు మరికొందరు కీలక వ్యక్తులను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అప్పటి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఎఫ్‌వో ఎ.రఘునాథన్, ముగ్గురు బ్యాంకు మాజీ ఉద్యోగులు, ముగ్గురు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధికారులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని మాల్యా నివాసంతోపాటు బెంగళూరులోని యూబీ టవర్స్, అగర్వాల్, రఘునాథన్ నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.