: ప్ర‌త్యేక హోదా ఆందోళ‌న కోసం సిద్ధ‌మ‌వుతున్న ఏపీ యువ‌త‌.. 26న విశాఖ బీచ్‌రోడ్డులో నిర‌స‌న‌.. ప‌వ‌న్ మ‌ద్ద‌తు


త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు కోసం ప‌ట్టుస‌డ‌ల‌కుండా యువ‌త చేసిన నిరస‌న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు న‌డుం బిగించింది. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని రామ‌కృష్ణ బీచ్ వేదిక‌గా ఈనెల 26 నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. హోదా కోసం పోరును ముమ్మ‌రం చేద్దామంటూ సామాజిక మాధ్య‌మాల ద్వారా పోస్టింగులు చేస్తున్నారు. రిప‌బ్లిక్ డే నాడు సాయంత్రం పార్టీల‌కు అతీతంగా కిర్లంపూడి లే అవుట్ ఎదురుగా బీచ్‌రోడ్డులో నిర్వ‌హించే శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. యువ‌త పిలుపున‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే యువ‌త చేప‌ట్ట‌నున్న నిర‌స‌న కార్య‌క్ర‌మం అనుమ‌తి కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ యోగానంద్ తెలిపారు.

  • Loading...

More Telugu News