: 'వంశధార' నిర్వాసితులకు చంద్రబాబు క్షమాపణ.. పరిహారం చెల్లించాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు క్షమాపణలు చెప్పారు. పరిహారం చెల్లింపులో జాప్యం జరిగినందుకు తనను క్షమించాలని వేడుకున్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించి జీవో జారీ చేశామని, అయితే వాటిని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని అన్నారు. అధికారుల అలసత్వం వల్లే పరిహారం చెల్లింపులో జాప్యం జరిగిందని తెలిపారు. ఆలస్యమైనందుకు చింతిస్తున్నానని, జాప్యానికి తనను క్షమించాలని రైతులను కోరారు. నేటినుంచే రైతులకు నష్టపరిహారం పంపిణీ చేస్తామని పేర్కొన్న ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.