: ప్రధాన ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్న ‘పేటీఎం’
వైద్య ఖర్చుల చెల్లింపులు సులభతరం చేయాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రుల్లో నగదు రహిత లావాదేవీలకు పేటీఎం సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ‘పేటీఎం’ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రముఖ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మసీలతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఎస్ఆర్ఎల్, థైరో కేర్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, 98.4 గ్లోబల్ హెల్త్ లైన్, డాక్టర్ బాత్రాస్, ఫోర్టిస్, మ్యాక్స్, అపోలో వంటి గ్రూపులతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా ఆసుపత్రుల శాఖల్లో పేటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం తమ సెక్టార్ లో తమ సంస్థ ద్వారా రోజుకు 75 వేల లావాదేవీలు జరుగుతున్నాయని, దీనిని పది లక్షలకు పెంచుకోవాలనేదే తమ లక్ష్యమని కిరణ్ వాసిరెడ్డి పేర్కొన్నారు.