: భుజం తడుతున్న మీ చేయి ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే!: రాజమౌళి లేఖకు క్రిష్ స్పందన


ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి ప్రశంసల వర్షం కురిసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నటనతో పాటు, ముఖ్యంగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్ కు ప్రేక్షకుల నుంచి పలువురు ప్రముఖుల వరకు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా సామాజిక మాధ్యమం ద్వారా క్రిష్ ను అభినందిస్తూ ఇటీవల ఒక పోస్ట్ చేశారు.

దీనిపై క్రిష్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ‘సాహో రాజమౌళి.. సాహో!!’ అని స్పందిస్తూ.. ‘ప్రియమైన రాజమౌళి గారూ, నాకు ఆదర్శంగా నిలిచిన దర్శకుల్లో మీరు ఒకరు.. అందరూ విజయం కోసం ఎదురుచూస్తుంటారు, కానీ, విజయం.. మీ కోసం ఎదురుచూస్తుంటుంది.. అలాంటి మీరు 'విజయం వరించింది  క్రిష్' అంటే నాకెలా వుంటుంది? ఎన్ని ధన్యావాదాలు చెపితే సరిపోతుంది? దర్శకత్వంలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా నాకు ఆదర్శంగా నిలిచారు.. మీ అభినందన వింటుంటే, ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్టుంది.. భుజం తడుతున్న మీ చేయి ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే.. త్రికరణ శుద్ధిగా చెపుతున్నాను.. సాహో రాజమౌళి..సాహో.. ప్రేమతో, క్రిష్’ అని ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ దర్శకుడు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News