: మరో రికార్డు దిశగా దంగల్... విదేశాల్లో 200 కోట్లు దాటేసింది!


 బాలీవుడ్ చరిత్రను తిరగరాశాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన 'దంగల్' సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటికే రికార్డు వసూళ్లు సాధించిన 'దంగల్' తాజాగా ఓవర్సీస్ లో 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా రికార్డు పుటలకెక్కింది.

ఈ నెల 22 నాటికి విదేశీ మార్కెట్లో 'దంగల్‌' 200.65 కోట్ల రూపాయలు వసూలు చేసిందని బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మరోవైపు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'దంగల్' రికార్డులను ఇప్పటికే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల నాటికి అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యల కారణంగా సినిమాకు ఆదరణ లభించే అవకాశం లేదని, పలువురు అభిప్రాయపడగా, సినిమా బాగుంటే ఎలాంటి అడ్డంకులు ఉండవని, ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారని చెప్పడానికి అమీర్ 'దంగల్' అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. కలెక్షన్లు నిలకడగా ఉండడంతో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'దంగల్' నిలవనుంది. 

  • Loading...

More Telugu News