: గుంటూరు మిర్చి.. ఒంగోలు గిత్త.. ఎన్టీఆర్ పౌరుషం ప్రపంచ ప్రసిద్ధి!: రేవంత్ రెడ్డి


గుంటూరు మిర్చి.. ఒంగోలు గిత్త.. ఎన్టీఆర్ పౌరుషం ప్రపంచ ప్రసిద్ధి చెందాయని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో జాతీయ ఎడ్లపందాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటితే, తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చూపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రపంచ దేశాలు తలెత్తుకుని తిలకించే రాజధానిని అమరావతిలో నిర్మిస్తారని, అమరావతి నిర్మాణాన్ని చెడగొట్టేందుకు జగన్ యత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News