: అప్పుడు, పవన్ కల్యాణ్ నిద్రపోయారా?: ఎంపీ రాయపాటి
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఘాటుగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం కష్టమని, ‘జల్లికట్టు’ కోసం తమిళనాడులో అందరూ ఏకతాటిపైకి వచ్చారని, అది లిమిటెడ్ సబ్జెక్ట్ అని అన్నారు. ‘రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదాపై పవన్ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు నిద్రపోయారా?’ అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కల్యాణ్ మాట్లాడాలని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణ ఎంపీల్లో ఐక్యత ఉంది కానీ, ఏపీ ఎంపీల్లో ఐక్యత లేదంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు.