: ‘జల్లికట్టు’ ఉద్యమకారులకు రజనీకాంత్ పిలుపు!


చెన్నైలోని మెరీనా బీచ్ నుంచి ‘జల్లికట్టు’ ఉద్యమకారులను వెళ్లగొట్టేందుకు పోలీస్ చర్యలు చేపట్టడంతో పలు ప్రాంతాల్లో ఈ రోజు హింసాకాండ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక ట్వీట్ చేశారు. ‘జల్లికట్టు’ ఉద్యమకారులు తమ నిరసనలు, ఆందోళనలు విరమించాలని రజనీకాంత్ పిలుపు నిచ్చారు. ఆ విధంగా చేయకపోతే,ఈ ఉద్యమాన్ని అసాంఘికశక్తులు తమ చేతుల్లోకి తీసుకుంటాయని, దీంతో, ఉద్యమకారులకు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని తన లెటర్ ప్యాడ్ పై తమిళ్  భాషలో రాసి, దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News