: ఓటేస్తే నెలకు ఐదు లీటర్ల పెట్రోల్ ఫ్రీ...స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాలజల్లు కురిపిస్తున్నాయి. నేడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ గోవా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫ్రీ మంత్రం జపించింది. తమను అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ప్రతినెలా ఐదు లీటర్ల పెట్రోల్ ఫ్రీగా ఇస్తామని గోవా కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రజలకు ఉచిత సురక్షిత మంచినీరు అందిస్తామని చెప్పింది. ప్రస్తుతం గోవాలో బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ తమను అధికారంలోకి తెస్తే పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, మహిళలకు ప్రెషర్ కుక్కర్ లు అందిస్తామని హామీ ఇచ్చింది. యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.