: చెన్నైలో షాపుల లూటీ...పెరుగుతున్న హింస


తమిళనాడులో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. జల్లికట్టు కోసం విద్యార్థుల ఆధ్వర్యంలో మెరీనా బీచ్ తీరంలో శాంతియుతంగా గత ఆరు రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి కేంద్రం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జల్లికట్టుపై ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. అయితే ఆర్డినెన్స్ తో జల్లికట్టుపై నిషేధం తొలగిపోలేదని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన విరమించలేదు. ఈ క్రమంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని పరేడ్ నిర్వహించాల్సి ఉంటుందని, మెరీనా బీచ్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు ఆందోళనకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

వారు కదలకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. దీంతో జల్లికట్టు ఉద్యమం హింసాత్మక రూపం దాల్చింది. పోలీసులపై ఆందోళనకారులు తిరగబడ్డారు. దీంతో పోలీసులు వారిని అణచివేసే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై దాడులకు దిగారు. పోలీస్ స్టేషన్ ను అగ్నికి ఆహుతి చేశారు. వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలో చెన్నైలోని పలు వీధుల్లో షాపులను లూటీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్రం నుంచి అదనపు బలగాలను తమిళనాడుకు పంపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. 

  • Loading...

More Telugu News