: ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకుంటారు!: వైసీపీ నేత అంబటి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీఆర్ మరణించారు కానీ, ఆయన ప్రత్యేకహోదాకు వెన్నుపోటు పొడిచినంత మాత్రాన పోరాటం మరణించదని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి, కేంద్రంతో పోరాడి ఆర్డినెన్స్ సాధించుకున్నారని చెప్పారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబునాయుడు అసలు ఎవరి ఊహల్లో కూడా లేని ప్రత్యేకప్యాకేజీ సాధించుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రజలు జల్లికట్టు, గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడుతారని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీయే ప్రత్యేకహోదాకి అడ్డంకి అని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదాకు పవన్ కల్యాణ్ మద్దతు పలకడం ఆనందదాయకమని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదాపై టీడీపీయే అడ్డమని, దానిపై తిరగబడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అర్థం చేసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. 

  • Loading...

More Telugu News