: ఉద్యోగంలో చేరిన ఆనందంలో ఉండగానే.. అనంతవాయువుల్లో కలిసిపోయాడు!
ఏ తప్పూ చేయకపోయినా కొందరు భారీ శిక్షకు గురవుతారన్న సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నజ్రుల్ ఇస్లాం (32) అనే వ్యక్తి కారు డ్రైవర్ గా నిన్న విధుల్లోకి చేరాడు. రాత్రి 11:15 సమయంలో కస్టమర్ కోసం ఐఐటీ ఫ్లై ఓవర్ పై నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వేగంగా వెనుకగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు ఇతని కారుని బలంగా ఢీ కొట్టింది. దీంతో నజ్రుల్ కారు అమాంతం గాల్లోకి లేచి పల్టీలు కొట్టింది. దీంతో నజ్రుల్ కారులో నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే నజ్రుల్ కారును ఢీ కొట్టిన బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న వ్యక్తి కారుదిగి పరారయ్యాడు. అయితే అతనికి 20 ఏళ్లు ఉంటాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.