: యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమే: కంగనా రనౌత్
బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తాజా సినిమా ‘రంగూన్’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ లతో కలిసి కంగనా ఇందులో నటించింది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృంగార సన్నివేశాలూ కనిపిస్తాయి. ఆ సన్నివేశాల్లో కంగనా రనౌత్ న్యూడ్ గా నటించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించిది. ‘నిజానికి యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమే. శృంగారం ఓ కళే’ అని చెప్పుకొచ్చింది.