: ఏపీకి ప్రత్యేక హోదా బాధ్యత వారిద్దరిదే: ముద్దు కృష్ణమనాయుడు కీలక వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి టీడీపీ కీలక నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడిపెడుతూ కొందరు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆయన... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధాలు చేసుకోలేవని అన్నారు. ప్రత్యేక హోదా వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ అనలేదని... ప్రధాని మోదీకి ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు మొదటి డిమాండ్ అదేనని తెలిపారు. ప్రత్యేక హోదా సమస్యకు కారణం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలే అని అన్నారు. ఇప్పుడు వారిద్దరూ మోదీకి కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్నారని... మోదీ కాళ్లు పట్టుకుంటారో, ఇంకేదైనా చేస్తారో... ప్రత్యేక హోదా తీసుకురావాల్సింది వారిద్దరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

  • Loading...

More Telugu News