: ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చిలో: మంత్రి యనమల
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చిలో నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. బడ్జెట్ ముందస్తు ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ఉన్నందు వల్ల వాస్తవిక బడ్జెట్ ను రూపొందిస్తున్నామని, ఖర్చుల ఆధారంగా ఆయా శాఖలకు నిధులను కేటాయించనున్నామని చెప్పారు. రెవెన్యూలోటు రూ.4 వేల కోట్లుగా ఉందని, మూడేళ్లలో రెవెన్యూ లోటును సున్నకు తీసుకువస్తామని యనమల పేర్కొన్నారు.