: ఇది విద్యార్థుల పని కాదు... వారి ముసుగులో ఎవరో చేస్తున్నారు: నటుడు లారెన్స్


‘జల్లికట్టు’ ఉద్యమం దారి తప్పడానికి, ఉద్రిక్తపరిస్థితులు తలెత్తడానికి కారణం విద్యార్థులు కాదని, వారి ముసుగులో హింస ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ అన్నాడు. ‘జల్లికట్టు’ ఉద్యమం నేపథ్యంలో చెన్నై, మధురైతో పాటు పలు చోట్ల ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, మెడ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాను, తన తల్లి వద్దని చెబుతున్నా ఈ విషయం తెలుసుకుని మెరీనా బీచ్ వద్దకు వచ్చానని అన్నాడు. ‘జల్లికట్టు’పై ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదని, సంతోషంగా జరగాల్సిన క్రీడ విషాదంగా మారిందని, దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అని లారెన్స్ ప్రశ్నించాడు. పోలీసులు తోసివేయడంతో తన మెడనొప్పి మరింత పెరిగిందని లారెన్స్ వాపోయాడు.

  • Loading...

More Telugu News