: హోదా కోసం ఏం చేసినా మద్దతిస్తా... యువత కదలాలి: జగన్ పిలుపు


ఏపీకి ప్రత్యేక హోదాను కోరుకుంటూ ఎలాంటి సభ నిర్వహించినా, కార్యక్రమాలు చేపట్టినా తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని వైకాపా అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు నేటి ఉదయం 11:47 గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. "ఏపీకి స్పెషల్ స్టాటస్ కోరుతూ ఏ కార్యక్రమం చేపట్టినా స్వాగతిస్తాం. ప్రతిఒక్కరూ, ముఖ్యంగా యువత ముందడుగు వేసి హోదా కోసం చేపట్టే కార్యక్రమాలకు మద్దతిచ్చి, వాటిని విజయవంతం చేయాలి" అని జగన్ కోరారు. కాగా తమిళనాట జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటం తరహాలోనే ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న రాష్ట్రవ్యాప్త నిరసనలకు యువత కదులుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News