: వారికి మరికొంత సమయాన్ని ఇస్తే చాలు.. గాడిలో పడతారు: కోహ్లీ


ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఓపెనర్లు వైఫల్యం చెందడం చర్చనీయాంశంగా మారింది. ధావన్, కేఎల్ రాహుల్, అజింక్యా రహానే ముగ్గురూ నిరాశ కలిగించారు. చివరి వన్డేలో భారత్ ఓటమికి ఓపెనర్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. భారత్ కు మంచి ఓపెనర్లు ఉన్నారని... కొత్త ఓపెనర్ల కోసం అన్వేషణ అవసరం లేదని అన్నారు. అయితే, ప్రస్తుతం వారు ఫామ్ లో లేరని... కొంత సమయం ఇస్తే మళ్లీ గాడిలో పడతారని చెప్పాడు. గతంలో ఓపెనింగ్ బాగుండేదని... మిడిల్ ఆర్డర్ మాత్రం సమస్యల్లో ఉండేదని.. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని... మిడిల్ ఆర్డర్ బలంగా తయారైతే, ఓపెనింగ్ నిరాశపరిచిందని తెలిపాడు. త్వరలోనే ఈ సమస్య సర్దుకుంటుందని అన్నాడు. 

  • Loading...

More Telugu News