: వింత శిశువుకు జన్మనిచ్చిన మహిళ!
ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, రెండు పురుషాంగాలతో బాలుడు జన్మించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నాడు. రాయచూర్ జిల్లాలోని పులదిన్ని గ్రామానికి చెందిన లలితమ్మ (23) స్థానిక ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బళ్లారిలోని విజయనగర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చిన్నారిని తరలించాలని వైద్యులు సూచించారు. అయితే, అందుకు లలితమ్మ ఒప్పుకోలేదు. ఈ బిడ్డ తమకు దేవుడిచ్చిన వరమని చెప్పింది. అయితే ఆమెను ఒప్పించిన వైద్యులు.. చిన్నారిని విమ్స్ కు తరలించారు. అక్కడ చిన్నారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి శస్త్ర చికిత్స నిర్వహించి, సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వైద్యులు తెలిపారు.