: సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ ఇదే... సమస్య ఏదైనా సరే, ఈ నంబర్ కు మెసేజ్ చేయచ్చు!


శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'మీ ముందు జరిగే ఎలాంటి అన్యాయమైనా, అక్రమమైనా వెంటనే వాట్సాప్ ద్వారా మా దృష్టికి తీసుకురండి. మిగతాది మేము చూసుకుంటా'మని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. తమ వాట్సాప్ నంబర్ 9490617444కు వివరాలను అందించండి అని చెబుతున్నారు. మహిళలపై నేరాలు, వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ జామ్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, కిడ్నాప్, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు తమకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాలని కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఈ సౌకర్యాన్ని ఓ ఆయుధంగా చేసుకోవాలని సూచించారు. 

  • Loading...

More Telugu News