: మదరాసీలంటూ హేళన చేస్తారా?: ఉత్తరాది రాజకీయాలపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్


ఉత్తరాది పాలకులకు దక్షిణాది ప్రజల గురించి ఏం తెలుసునని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అసలు దక్షిణాదిలో ఎన్ని భాషలు ఉన్నాయో వారికి తెలుసా? అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అడిగిన ఆయన, దక్షిణాది వారందరినీ కలిపి మదరాసీలని పిలుస్తూ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రాజకీయ వర్గాల్లో ధైర్యం కొరవడిందని, నాణ్యతలేని రాజకీయాలు చేస్తున్నారని, బాధ్యతతో వ్యవహరించడం లేదని ఆరోపించారు. "ఆంధ్రప్రదేశ్ యువత తమ గొంతును శాంతియుతంగా వినిపించాలి. అదే సమస్యలు తీరేందుకు పరిష్కారం. వారు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా సాధనకు అదే మార్గం" అని పవన్ ట్వీటారు.


  • Loading...

More Telugu News