: సైనాను అభినందించిన కేసీఆర్
మేటి బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మలేషియన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను సైనా గెలవడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సైనా మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. నిన్న జరిగిన ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన చోచ్ వాంగ్ పై ఘన విజయం సాధించి టైటిల్ ను గెలుచుకుంది సైనా. ఈ సీజన్ లో సైనాకు ఇదే తొలి టైటిల్.