: శ్వేతసౌధాన్ని పేల్చేయాలంటూ సింగర్‌ మడోన్నా వివాదాస్పద వ్యాఖ్యలు


వాషింగ్టన్‌ డీసీలో డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగిన నిర‌స‌న‌లో ప్ర‌సిద్ధ‌ పాప్‌ సింగర్‌ మడోన్నా కూడా పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... శ్వేత సౌధాన్ని పేల్చేయాలని తాను అనుకుంటున్న‌ట్లు వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఒక్క‌సారిగా టీవీ చానెళ్లు వెంటనే ఆ ఆందోళన లైవ్‌ ప్రసారాలను ఆపేశాయి. అనంత‌రం మడోన్నా వ్యాఖ్యలపై సామాజిక మాధ్య‌మాల్లో తీవ్ర‌ విమర్శలు వచ్చాయి. దీంతో మడోన్నా మ‌రోసారి తాను కేవలం ఉపమానయుక్తంగానే అలా ప్ర‌సంగించాన‌ని స‌మ‌ర్థించుకుంది.

తాను హింసను కోరుకునే వ్యక్తిని కాద‌ని తెలిపింది. తాను రెండురకాల అభిప్రాయాలను వ్యక్తం చేశాన‌ని అంది. ఆశాజనకమైన అభిప్రాయం మొద‌టిది కాగా, మరొకటి ఆగ్రహం, ఆవేశంతో ఉన్న అభిప్రాయం అని సోష‌ల్ మీడియాలో పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్‌ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశార‌ని, ఆయ‌న విధానాలను ఎదుర్కోవడానికి స్త్రీలందరూ సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News