: తిరుమలలో గణనీయంగా తగ్గిన రద్దీ... రేపటి ఆర్జిత సేవలకూ అందుబాటులో టికెట్లు!


తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. సర్వదర్శనమైనా, నడకదారి భక్తులకైనా, ప్రత్యేక ప్రవేశ దర్శనమైనా రెండు గంటల్లోపే స్వామివారి దర్శనం అవుతోందని టీటీడీ ప్రకటించింది. మంగళవారం నాడు స్వామివారి ఆర్జిత సేవలకూ టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. 80 కల్యాణోత్సవం టికెట్లు, 12 అర్చన టికెట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు దాదాపు 5 వేల వరకూ అందుబాటులో ఉన్నట్టు 'టీటీడీ సేవా ఆన్ లైన్' వెబ్ సైట్ చూపుతోంది. సేవలకు సంబంధించిన టికెట్లను పొందగోరేవారు ఈ మధ్యాహ్నంలోగా తమ పేర్లను నమోదు చేయించుకుంటే, సాయంత్రం లాటరీ విధానంలో టికెట్లను భక్తులకు అందిస్తామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News