: జగన్ సీఎం అయితే తొలి దర్శనం కోసం మేడారం తీసుకొస్తాం: తెలంగాణ వైసీపీ నేత
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తొలి దర్శనం కోసం ఆయనను మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధికి తీసుకొస్తామని జయశంకర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అప్పం కిషన్ తెలిపారు. పార్టీ నేతలతో కలసి మేడారంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వన దేవతల ఆశీస్సులు జగన్ కు ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే నెల 8 నుంచి 11వ తేదీ వరకు జరిగే మినీ జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం అవసరమైన సౌకర్యాలన్నింటినీ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.