: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్థాన్ జాతీయుడు!
పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ హనీఫ్ (85) అనే ఓ వృద్ధుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. స్మగ్లింగ్ కేసులో అతను భారత్ లో శిక్షను అనుభవిస్తున్నాడు. గత ఏడాది ఏప్రిల్ 6న అతడి శిక్షాకాలం ముగిసింది. అయినప్పటికీ అతను ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ నేపథ్యంలో, తనను అన్యాయంగా జైల్లో నిర్బంధించారని, తనను స్వదేశానికి పంపించాలంటూ అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏకే పతాక్ నేతృత్వంలోని బెంచ్... ఫిబ్రవరి 2వ తేదీ లోపల వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది.