: చంద్రబాబు ఇస్తానంటే నేను వద్దంటానా?: భూమా


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలిచి మంత్రి పదవిని ఇస్తానంటే తప్పకుండా తీసుకుంటానని, తాను మాత్రం పదవి కోసం పాకులాడబోనని నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి వస్తే, కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతలైన శిల్పా సోదరులు, ఏరాసు తదితరులు టీడీపీకి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలు నిరాధారమేనని స్పష్టం చేశారు. వారితో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, అందరం కలిసే పార్టీని నడిపించాలన్నది తన అభిమతమని వెల్లడించారు. తన పార్టీ కార్యకర్తలు ఎలా చెబితే అలా వినడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం తన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ రాజకీయంగా ఎదగాలన్న కోరిక ఉంటుందని, మంత్రి పదవిపై ఆశలు ఉండటం సహజమేనని భూమా అన్నారు.

  • Loading...

More Telugu News