: మెరీనాబీచ్ వద్ద ఉద్రిక్తత.. సముద్రంలో దూకుతామంటూ విద్యార్థుల బెదిరింపులు
చెన్నైలోని మెరీనాబీచ్ వద్ద మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జల్లికట్టు నిషేధంపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మెరీనాబీచ్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ ప్రాంతం నుంచి తమను ఖాళీ చేయించాలని చూస్తే సముద్రంలో దూకుతామంటూ విద్యార్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. జల్లికట్టుకు ఆర్డినెన్స్‌తో సరిపుచ్చడం సరికాదని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. విద్యార్థుల బెదిరింపులతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వారిని అక్కడి నుంచి పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు శాఖతో సంప్రదింపులు జరుపుతోంది.