: అగ్రకులాల ఊచకోత కేసులో నలుగురికి క్షమాభిక్ష.. మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన రాష్ట్రపతి
మరణశిక్ష పడిన నలుగురు దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించారు. 1992లో బీహారులో అగ్రకులాలకు చెందిన 34 మంది ఊచకోతకు గురయ్యారు. ఈ కేసులో కృష్ణమోచీ, నన్హేలాల్ మోచీ, బిర్ కుమెర్ పాశ్వాన్, ధరుసింగ్‌లను దోషులుగా నిర్ధారించిన కోర్టు మరణశిక్ష విధించింది. అయితే దోషులకు క్షమాభిక్ష ప్రసాదించవద్దంటూ హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. హోంమంత్రిత్వ శాఖ సిఫార్సును తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు.