: నేడు కూనేరుకు జగన్.. రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైసీపీ అధినేత
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విజయనగరం జిల్లాలోని కూనేరు వెళ్లనున్నారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన ప్రాంతాన్ని పరిశీలించనున్న ఆయన అనంతరం బాధితులను పరామర్శించనున్నారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు చేరుకుని వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తారు. అలాగే బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.