: అమెరికా ప్రస్తుత దుస్థితి స్వయంకృతాపరాధమే!: 'అలీబాబా' సంచలన ఆరోపణ
అమెరికాపై ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అలీబాబా డాట్‌కామ్ సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక పరిస్థితికి కారణం వేరెవరో కారణం కాదని, స్వయంగా ఆ దేశ స్వయంకృతాపరాధమేనని పేర్కొంది. అమెరికా గత మూడు దశాబ్దాల కాలంలో యుద్ధాలపై ఏకంగా రూ.952 లక్షల కోట్లను ఖర్చు చేసిందని, ఆ దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి అదే ప్రధాన కారణమని తెలిపింది. అమెరికా ఆర్థిక పరిస్థితి కుదేలు కావడానికి కారణం అదే తప్ప చైనాతో వ్యాపార సంబంధాల వల్ల కాదని తేల్చి చెప్పింది. అమెరికన్ల ఉద్యోగాలను చైనా దొంగిలించడం లేదని అలీబాబా పేర్కొంది.
వ్యాపార యుద్ధాన్ని ప్రారంభించడం తేలికే కానీ దానిని ముగించడం మాత్రం అనుకున్నంత తేలిక కాదని అలీబాబా డాట్‌కామ్ అధినేత జాక్‌మా పేర్కొన్నారు. 1979లో అమెరికాలో చైనా వ్యాపార విలువ 2.5 బిలయిన్ డాలర్లు అయితే 2016 నాటికి అది 211 రెట్లు పెరిగి 519 బిలియన్ డాలర్లకు చేరుకుందని వివరించారు. మూడు దశాబ్దాల క్రితం మేధోసంపత్తి హక్కులను మాత్రమే తన వద్ద ఉంచుకున్న అమెరికా, ఉద్యోగాలను మాత్రం ప్రపంచానికి వదిలేసిందని జాక్‌మా విమర్శించారు.