: డిజిటల్ లావాదేవీలపై రేపు మోదీకి మధ్యంతర నివేదిక అందించనున్న చంద్రబాబు.. ఆధార్ ఆధారిత చెల్లింపులపై పేటెంట్ కోసం సూచన!
డిజిటల్ లావాదేవీలపై కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి కన్వీనర్‌గా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి మధ్యంతర నివేదిక సమర్పించనున్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను ఎత్తివేస్తే కనుక డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించినట్టు అవుతుందని ప్రధానికి వివరించనున్నారు. అలాగే ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం ప్రపంచంలో మరెక్కడా లేదని, దీనికి పేటెంట్ కోసం దరఖాస్తు చేయాలని సూచించనున్నారు. కొత్తగా వస్తున్న పేమెంట్ బ్యాంకులు తమ ఖాతాదారులకే కాకుండా ఇతర పేమెంట్ బ్యాంకు ఖాతాదారులకు కూడా సేవలు అందించాలని, ఇందుకోసం ఇంటర్ ఆపరేటబిలిటీ(పరస్పర చెల్లింపులు) ఉండాలని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఆధార్ ఆధారిత చెల్లింపుల విషయంలో చొరవ చూపిన ఐడీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులను కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ తీసుకువెళ్లనున్నారు.