: బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఏడుగురు బాలురు.. అరెస్ట్


మేఘాలయలోని మత్టెన్‌ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలికపై ఏడుగురు మైనర్‌ బాలురు రెండు సార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఆ బాలుర వ‌య‌సు 14-16 మ‌ధ్య ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. బాధిత‌ బాలికపై గత ఏడాది డిసెంబరులో తొలిసారి అత్యాచారం జరిపిన వారు ఈ నెల‌ 13న కూడా మ‌రోసారి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌ని పేర్కొన్నారు. ఆ బాలిక‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామ‌ని, ఈ దారుణానికి పాల్ప‌డ్డ నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. వారంతా నేరం చేసినట్లు ఒప్పుకున్నార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం వారిని బాలల న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News