: లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థినులను భయాందోళనలకు గురి చేసిన యువకులు


లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించిన పలువురు దుండగులు విద్యార్థినులను భయాందోళనలకు గురిచేసిన ఘటన నిన్న అర్ధరాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలోని పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన హాస్టల్‌లో చోటుచేసుకుంది. నలుగురు యువకులు హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించారని, అనంతరం వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని ఆ క‌ళాశాల‌ ప్రిన్సిపాల్‌ రామసుబ్బారెడ్డి తెలిపారు. ఆయ‌నతో పాటు నంద్యాల టూటౌన్‌ పోలీసులకు విద్యార్థినులు ఈ రోజు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News