: ‘జయహో సైనా’... మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీలో సైనా నెహ్వాల్ విజయ దుందుభి
నిన్న హాంగ్ కాంగ్ క్రీడాకారిణి యిప్ పుయీ యిన్ ను చిత్తుగా ఓడించి మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ ఫైనల్ మ్యాచ్ లోకి అడుగు పెట్టిన ఇండియన్ బ్యాట్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఈ రోజు కూడా విజయ దుందుభి
మోగించింది. ఈ రోజు థాయిలాండ్ క్రీడాకారిణి చొచువాంగ్‌తో చివరివరకు ఎంతో ఉత్కంఠతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 22-20, 22-20 తేడాతో విజయభేరీ మోగించి, మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టైటిల్ ను కైవసం చేసుకుంది.